కాంతార చాప్టర్ 1 షూటింగ్ లో ప్రమాదం..! 27 d ago
కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న కాంతార ది లెజెండ్ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి షూటింగ్ పూర్తి చేసుకొని చిత్ర బృందం లోని 20 మంది సభ్యులు మినీ బస్సు లో వెళ్తుండగా బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం లో ఆరుగురు సభ్యులు గాయపడ్డారు. ఈ ఘటన జడ్కల్ లోని ముదూరు నుండి కొల్లూరు కు తిరిగి వస్తుండగా జరిగింది. ఈ మేరకు షూటింగ్ నిలిపివేసినట్లు సమాచారం.